🌹 . శ్రీ శివ మహా పురాణము - 788 / Sri Siva Maha Purana - 788 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 20 🌴
🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 6 🌻
తరువాత కైలాస పర్వత సానువులయందు ప్రమథ గణములకు రాక్షసులకు మధ్య శస్త్ర - అస్త్రములతో అల్లకల్లోలముగనున్న ఘోరయుద్ధము జరిగెను (44). భేరీలు, మృదంగములు, శంఖములు ధ్వని చేయుచూ వీరులకు ఉత్సాహము కలిగించుచుండెను. ఏనుగులు, గుర్రములు మరియు రథముల శబ్దములచే భూమి మారుమ్రోగి కంపించెను (45). శక్తి, తోమర, ముసల, పాశ, పట్టిశములను ఆయుధములతో మరియు బాణసమూహములతో నిండియున్న ఆకాశము అంతయూ ముత్యములను వెదజల్లినట్లు ప్రకాశించెను (46). సంహరింపబడిన ఏనుగులతో, గుర్రములతో మరియు పదాతిసైనికులతో నిండియున్న భూమి, పూర్వము వజ్రముచే కొట్టబడిన పర్వతశ్రేష్ఠములచే కప్పబడి ఉన్న స్థితిని పోలియుండెను (47). ప్రమథుల చేతిలో అనేక రాక్షసులు, రాక్షసులు చేతిలో అనేక గణములు సంహరింపబడిరి. వారి రక్త మాంసముల బురదతో నిండి భూమి యొక్క ఉపరితలము కాలుపెట్టుటకు వీలులేనిదై ఉండెను (48).
ప్రమథులచే సంహరింపబడిన రాక్షసులనందరినీ శుక్రాచార్యుడు మృతసంజీవని యొక్క బలముచే పలుమార్లు యుద్ధములో మరల బ్రతికించుచుండెను (49). గణములందరు వారిని చూచి కంగారుపడి భయపీడితులై శుక్రుని ఆ కార్యమును గూర్చి దేవదేవుడగు శివునకు విన్నవించిరి (50). ఆమాటలను విని రుద్రభగవానుడు తీవ్రమగు కోపమును పొందెను. ఆయన మిక్కిలి రౌద్రాకారమును పొంది భయమును గొల్పెను. ఆయన తన తేజస్సుచే దిక్కులను మండునట్లు చేసెను (51).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 788 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 20 🌴
🌻 The fight between the Gaṇas and the Asuras - 6 🌻
44. Then at the ridges, valleys and sides of Kailāsa, a terrible battle was fought between the leaders of the Pramathas and the Daityas. Weapons clashed with weapons.
45. The whole earth shook resonant with the sounds of great war drums, Mṛdaṅgas and conches that inspired the heroes as well as the sounds of elephants, horses and chariots.
46. The whole atmosphere was filled with javeline, iron clubs, arrows, great pestles, iron rods, pikes etc. as if strewn with pearls.
47. With the dead elephants, horses and foot soldiers, the earth shone in the same way as before when great mountains were scattered, smitten by the thunderbolt of Indra.
48. With the groups of Daityas killed by the Pramathas, and with the Gaṇas killed by the Daityas, the whole ground was filled with suets, flesh and streams of blood. It became so marshy as it became impassable.
49. With the power of Sañjīvanī, Bhārgava resuscitated the forces of the Daityas killed by the Pramathas in the battle again and again.
50. On seeing them, all the Gaṇas were agitated and terrified. They intimated to the lord of the gods what Śukra did.
51. On hearing it, lord Śiva became terribly furious. He became terrific blazing the quarters as it were.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments