top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 789 / Sri Siva Maha Purana - 789


🌹 . శ్రీ శివ మహా పురాణము - 789 / Sri Siva Maha Purana - 789 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 20 🌴


🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 7 🌻


అపుడు రుద్రుని ముఖమునుండి అతిభయంకరమగు కృత్య (క్షుద్రశక్తి) ఉద్భవించెను. తాటి చెట్లు వంటి పిక్కలు, పర్వతగుహవంటి నోరుగల ఆమె తన స్తనములతో వృక్షములను చూర్ణము చేసెను (52). ఓ మహర్షీ! ఆమె వెంటనే యుద్ధభూమికి చేరుకొని అతి భయంకరాకారముతో మహారాక్షసులను భక్షిస్తూ సంచరించెను (53). అపుడామె యుద్ధమధ్యములో రాక్షసశ్రేష్ఠులచే చుట్టు వారబడిన శుక్రుడు ఉన్న స్థానమునకు శీఘ్రముగా నిర్భయముగా చేరెను (54). ఓ మునీ! ఆమె తన తేజస్సుతో ఆకాశమును నింపి, తాను నడిచిన భూభాగమును బ్రద్ధలు కొట్టి, భార్గవుని ఒడిసి పట్టి ఆకాశములోనికి ఎగిరి అంతర్ధానమాయెను (55). యుద్ధమునందు మదించియున్న రాక్షస సైనికులు యుద్ధరంగమునుండి భార్గవుడు అంతర్హితుడగుటను గాంచి మాడిపొయిన ముఖములు గల వారై యుద్ధమునుండి వెనుదిరిగిరి (56). అపుడు తుఫాను గాలిచే ఎగురగొట్టబడి గడ్డిమోపు చెల్లాదెదరైన తీరున, ప్రమథగణములచే పీడింపబడిన రాక్షససేన భయముతో చెల్లాచెదరయ్యెను (57).


గణముల బయము వలన చెల్లాచెదరైన రాక్షస సేనను చూచి సేనానాయకులగు శుంభనిశుంభులు మరియు కాలనేమి మిక్కిలి కోపించి కేకలను వేసిరి (58). మహాబలవాలురగు వారు ముగ్గురు, వర్షాకాలమునందు మేఘములు వలె, గణసైన్యముపై బాణవృష్టిని కురింపించి ఆ సైన్యమును నిలువరించిరి (59). అపుడ ఆ రాక్షసుల బాణసమూహములు మిడతల దండుల వలె ఆకాశమును అన్ని దిక్కులను కప్పి వేసి ప్రమథగణసైన్యము వణికి పోవునట్లు చేసినవి (60). అసంఖ్యాకములగు శరములచే చీల్చివేయబడిన గణములు రక్తమును ప్రవాహముగా వర్షించి వసంతకాలము నందలి కింశుకవృక్షములను బోలి యుండిరి . వారికి ఏమి చేయవలెనో తోచలేదు (61). అపుడు నంది, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి మొదలగు గణాధ్యక్షులు తమ సైన్యము చెల్లాచెదరు ఆగుచుండుటను గాంచి మిక్కిలి కోపించి తొందరపడి ఆ రాక్షసవీరులను బలముగా ఎదుర్కోని అపివేసిరి (62).


శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహిత యందు యుద్ధఖండలో ప్రమథగణరాక్షస యుద్ధవర్ణనమనే ఇరువదియవ అధ్యయము ముగిసినది (20).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 789 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 20 🌴


🌻 The fight between the Gaṇas and the Asuras - 7 🌻



52. A terrible Kṛtyā came out of Rudra’s mouth. Her calves were as stout as Palmyra trees. Her mouth was huge and deep like mountain caverns. With her breasts she crushed huge trees.


53. O excellent sage, she rushed immediately to the battle ground. The terrible Kṛtyā roamed the battleground devouring the great Asuras.


54. Fearlessly she rushed amid the battle-field where Bhargava was stationed surrounded by the leading Daityas.


55. O sage, she enveloped the whole sky with her terrible brilliance. She split the ground she trod; she stuffed Bhārgava into her vaginal passage and vanished in the sky.


56. On seeing Bhārgava seized, the invincible armies of the Daityas became dejected and faded in their faces. They fled from the battle ground.


57. The army of the Daityas became scattered and split in their terrific fear of the Gaṇas like bundles of grass split and scattered when blown by the wind.


58. On seeing the army of the Daityas thus dispersed and frightened of the Gaṇas, the leaders Śumbha and Niśumbha and Kālanemi became infuriated.


59. All the three powerful Daityas obstructed the army of the Gaṇas showering arrows like the destructive clouds in the rainy season.


60. The volleys of arrows discharged by the Daityas enveloped all the quarters and the atmosphere like huge swarms of locusts. They shook the hosts of Gaṇas.


61. Split by hundreds of arrows, the Gaṇas shed streams of blood. They resembled the red Kiṃśuka flowers of the spring season. They did not know what to do.


62. On seeing their army thus shattered, the infuriated leaders Nandin, Gaṇeśa and Kārttikeya hurriedly checked the rushing Daityas.



Continues....


🌹🌹🌹🌹🌹





0 views0 comments

Komentáre


bottom of page