top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 790 / Sri Siva Maha Purana - 790


🌹 . శ్రీ శివ మహా పురాణము - 790 / Sri Siva Maha Purana - 790 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 21 🌴



🌻. గణాధ్యక్షుల యుద్ధము - 1 🌻


సనత్కుమారుడిట్లు పలికెను- నంది, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి అను గణాధ్యక్షులను గాంచి ఆ రాక్షసులు కోపముతో ద్వంద్వయుద్ధము కొరకై వారిపైకి ఉరికిరి (1). కాలనేమి నందితో మరియు శుంభుడు విఘ్నేశ్వరునితో తలపడిరి. నిశుంభుడు సందేహిస్తూనే షణ్ముఖదేవునిపైకి ఉరికెను (2). నిశుంభుడు అయిదు బాణములతో కుమారస్వామి యొక్క నెమలిని బలముగా హృతయమునందు కొట్టగా, అది మూర్ఛిల్లి నేలగూలెను (3). అపుడు శక్తి ధరుడగు కుమారస్వామి కోపించి అయిదు బాణములతో వాని గుర్రములను, మరియు సారథిని కూడ కొట్టెను (4). యుద్ధములో ఆజేయుడగు ఆ వీరుడు మరి యొక వాడి బాణముతో నిశుంబాసురుని గట్టిగా కొట్టి గర్జించెను (5). మహావీరుడు గొప్ప పరాక్రమ శాలియగు నిశుంభాసురుడు కూడ యుద్ధములో సింహనాదము చేయుచున్న ఆ కుమారస్వామిని తన బాణముతో కొట్టెను (6). తరువాత కుమారస్వామి కోపముతో శక్తిని తీసుకోన బోవునంతలో నిశుంభుడు వేగముగా తన శక్తితో దానిని కూల్చి వేసెను (7).


ఈ విధముగా అచట వీరవబ్దములతో గర్జించుచున్న కార్తికేయనిశుంభులకు గొప్ప యుద్ధము జరిగెను. ఓవ్యాసా! (8) అపుడు నందీశ్వరుడు ఏడు బాణములతో కాలనేమిని కొట్టి గుర్రములను, జెండాను, రథమును సారథిని చీల్చి వేసెను (9).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 790 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 21 🌴


🌻 Description of the Special War - 1 🌻



Sanatkumāra said:—


1. On seeing the leaders of the Gaṇas, Nandin, Gaṇeśa and Kārttikeya, the Dānavas rushed at them for a duel combat.


2. Kālanemi clashed with Nandin; Śumbha fought Gaṇeśa and Niśumbha hesitatingly rushed at Kārttikeya.


3. With five arrows Niśumbha hit the peacock of Kārttikeya in the chest and it fell unconscious.


4. Then the infuriated Kārttikeya discharged five arrows at his chariot and pierced the horses and the charioteer.


5. The invincible hero hit Niśumbha with another sharp arrow quickly and roared.


6. The Asura Niśumbha of great prowess and heroism hit Kārttikeya in the battle with his arrow as he roared.


7. By the time the furious Kārttikeya seized his spear, Niśumbha struck him with it.


8. Thus, O Vyāsa, a great fight between Kārttikeya and Niśumbha ensued as they shouted heroically.


9. Then Nandin hit Kālanemi with seven arrows and pierced his horses, banner, chariot and charioteer.



Continues....


🌹🌹🌹🌹🌹



1 view0 comments

Comments


bottom of page