🌹 . శ్రీ శివ మహా పురాణము - 791 / Sri Siva Maha Purana - 791 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 21 🌴
🌻. గణాధ్యక్షుల యుద్ధము - 2 🌻
కాలినేమి కూడ కోపించి తన ధనస్సు నుండి విడిచి పెట్టబడిన మిక్కిలి వాడియగు బాణములతో నందియొక్క ధనస్సును విరుగగొట్టెను (10). అపుడు వీరుడగు నందీశ్వరుడు మహారాక్షసుడగు ఆ కాలనేమిని ప్రక్కకు నెట్టి శూలముతో గట్టిగా వక్షస్థ్సలమునందు గొట్టెను (11). అతని వక్షస్థ్సలము ఆ శూలపు దెబ్బకు చీలియుండెను. అతని గుర్రములు మరియు సారథి మరణించిరి. అపుడు ఆతడు పర్వత శిఖరమును పెకలించి దానితో నందిని కొట్టెను (12). మరియు రథమును అధిష్ఠించియున్న శుంభుడు, మూషకవాహనుడగు గజాననుడు యుద్ధమును చేయుచూ, బాణపరంపరలతో ఒకరినొకరు కొట్టిరి (13).
అపుడు గజాననుడు శంభుని బాణముతో హృదయమునందు కొట్టెను. మరియు మూడు బాణములతో సారథిని నేలగూల్చెను (14). అపుడు శుంభుడు కూడ మిక్కిలి కోపించి గజాననుని బాణవర్షముతో ముంచెత్తి మూషకమును మూడు బాణములతో గొట్టి మేఘమువలె గర్జించెను (15). బాణములచే చీల్చబడిన అవయవములు గల మూషకము తీవ్రవేదనచే కంపించి పోయెను. నేలప్తెబడిన గజాననుడు పదాతి ఆయెను (16).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 791 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 21 🌴
🌻 Description of the Special War - 2 🌻
10. With very sharp shafts discharged from his bow, the infuriated Kālanemi cut the bow of Nandin.
11. Defying the great demon Kālanemi the heroic Nandīśvara hit him in the chest with his spear.
12. With his horses and charioteer killed and himself wounded in the chest, he broke the top of a mountain and hit Nandin.
13. Then Śumbha and Gaṇeśa seated respectively in a chariot and on a mouse fought each other with volleys of arrows.
14. Gaṇeśa hit Śumbha in his chest with an arrow and felled his charioteer with three arrows on the ground.
15. Then the infuriated Śumbha covered Gaṇeśa with a shower of arrows. Hitting the mouse with three arrows he roared like thunder.
16. The mouse pierced by the arrows, shook with acute pain. Gaṇeśa was thrown off (his vehicle) and he became a foot soldier (as it were).
Continues....
🌹🌹🌹🌹🌹
Comentários