top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 792 / Sri Siva Maha Purana - 792


🌹 . శ్రీ శివ మహా పురాణము - 792 / Sri Siva Maha Purana - 792 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 21 🌴


🌻. గణాధ్యక్షుల యుద్ధము - 3 🌻


అపుడు గజాననుడు శంభుని పరశువుతో హృదయమునందు కొట్టి నేలప్తె బడవేసి మూషకమునధిష్ఠించెను (17). మరల విఘ్నేశ్వరప్రభుడు యుద్ధమనకు సంసిద్ధుడాయెను. శుంభుడు నవ్వి పెద్ద ఏనుగును అంకుశముతో కొట్టిన విధంబున ఆయనను కోపముతో కొట్టెను (18). కాలనేమి మరియు నిశుంభుడు వీరిద్దరు కలిసి క్రోధమును ప్రదర్శిస్తూ ఏకకాలములో, సర్పముల వలె ప్రాణాంతకములగు బాణములతో గజాననుని ఒక్కుమ్మడిగా ముట్టడించిరి (19). ఇట్లు వ్యథను పొందియున్న గజాననుని గాంచి మహాబలుడగు వీర భద్రుడు కోటి భూతములతో గూడి వేగముగా ఆతని వ్తెపునకు పరుగెత్తెను (20) ఆయనతో బాటు కూష్మాండులు, భైరవులు, వేతాలులు, యోగనీగణములు, పిశాచములు, డాకిన్యాది గణములు కూడ వచ్చినవి (21).


అపుడు భూమి కిలకిలారావములతో, సింహనాదములతో, గర్జనలతో మరియు డమరుక ధ్వనులతో నిండి కంపించెను (22). అపుడు భూతములు యుద్ధ భూమిలో వేగముగా పరుగులెత్తుచూ రాక్షసులను తినుచుండెను; ప్తెకి ఎత్తి క్రింద పారవేయుచుండెను? మరియు నాట్యమాడుచుండెను (23). ఓ వ్యాసా! ఇంతలో నంది మరియు గుహుడు సంజ్ఞను పొంది నిలబడిరి. వారు అపుడా యుద్ధరంగములో అనేక పర్యాయములు గర్జించిరి (24).




సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹






🌹 SRI SIVA MAHA PURANA - 792 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 21 🌴


🌻 Description of the Special War - 3 🌻


17. Then Gaṇeśa hit Śumbha in his chest with his axe and felled him to the ground. Thereafter he mounted his mouse again.


18. Lord Gaṇeśa of elephantine face got ready for the fight. He hit him mockingly and angrily as if hitting a great elephant with a goad.


19. Kālanemi and Śumbha simultaneously attacked Gaṇeśa furiously with arrows as ruthless as serpents.


20. On seeing him afflicted, the powerful Vīrabhadra accompanied by a crore goblins rushed in.


21. The Kūṣmāṇḍas, Bhairavas, Vetālas, Yoginīs, Piśācas, Ḍākinīs and Gaṇas came there with him.


22. The Earth, resonant with various kinds of noise, shouts of joy, leonine roars and the sounds of Ḍamarukas, quaked.


23. Then the Bhūtas ran here and there devouring the Dānavas. They jumped up and danced in the battle field and threw the Asura on the ground.


24. In the meantime, O Vyāsa, Nandin and Guha regained their consciousness and got up. They roared in the battlefield again.




Continues....


🌹🌹🌹🌹🌹






1 view0 comments

Comments


bottom of page