top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 794 / Sri Siva Maha Purana - 794


🌹 . శ్రీ శివ మహా పురాణము - 794 / Sri Siva Maha Purana - 794 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 21 🌴


🌻. గణాధ్యక్షుల యుద్ధము - 5 🌻


భూమికి, స్వర్గమునకు మధ్యలోగల ఆకాశము జలంధరుని బాణములచే పొగమంచు తునకలతో వలె కప్పివేయబడెను (33). ఆతడు నందిని అయిదు, గణశుని అయిదు, మరియు వీరభద్రుని ఇరవై బాణములతో కొట్టి మేఘధ్వనితో సింహనాదమును చేసెను (34). అపుడు వెంటనే మహావీరుడు, రుద్రపుత్రుడు అగు కుమారస్వామి జలంధరాసురుని శక్తితో కొట్టి సింహనాదమును చేసెను (35).


శక్తిచే చీల్బడిన దేహము గల ఆ రాక్షసుడు కన్నులు తిరుగుటచే నేలప్తె బడెను. కాని మహాబలశాలి యగుటచే వెంటనే లేచి నిలబడెను (36). అపుడు రాక్షసశ్రేష్ఠుడగు జలంధరుడు క్రోధముతో నిండిన మనస్సు గలవాడై కుమారస్వామిని గదతో వక్షస్థ్సలముప్తె కొట్టెను (37). శంకరపుత్రుడగు ఆ కుమారస్వామి వరముగా నీయబడిన ఆ గద ప్రభావశాలి యనియు, వరరము పఫలమనియు నిరూపించుటకై వెంటనే నేలప్తె బడెను (38). అదే విధముగా మహావీరుడు, శత్రువులను సంహరించువాడు అయిననూ నంది కొంత కల్లోలమును పొందిన మనస్సు గలవాడై గదచే కొట్టబడి నేలపై బడెను (39).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 794 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 21 🌴


🌻 Description of the Special War - 5 🌻


33. The space between heaven and the earth became enveloped by the many arrows discharged by Jalandhara as if by floating masses of mist.


34. Hitting Nandin and Gaṇeśa with five arrows each and Vīrabhadra with twenty he roared like thunder.


35. Kārttikeya the heroic son of Śiva then swiftly hit the Daitya Jalandhara with his spear and roared.


36. With the body pierced through by the spear, the Daitya fell on the ground with eyes rolling. But the powerful Asura swiftly stood up.


37. Then Jalandhara the infuriated leader of the Daityas hit Kārttikeya in his chest with his mace.


38. O Vyāsa, plainly exhibiting the successful efficiency of the Mace secured as a favour from Brahmā Kārttikeya fell on the ground suddenly.


39. Similarly, struck by the mace Nandin too fell on the ground, He was distressed a little although he was a great hero and a destroyer of enemies.




Continues....


🌹🌹🌹🌹🌹






0 views0 comments

Comments


bottom of page