Dhanurmasam - గోదాదేవి వ్రతం, మార్గళి వ్రతం, శ్రీవ్రతం, కాత్యాయని వ్రతం - గోదాదేవి కళ్యాణం - వైకుంఠ ఏకాదశి పర్వదినాల మాసం ధనుర్మాసం, ధను సంక్రాంతి శుభాకాంక్షలు
- Prasad Bharadwaj
- 7 hours ago
- 2 min read

🌹 గోదాదేవి వ్రతం, మార్గళి వ్రతం, శ్రీవ్రతం, కాత్యాయని వ్రతం - గోదాదేవి కళ్యాణం - వైకుంఠ ఏకాదశి పర్వదినాల మాసం ధనుర్మాసం, ధను సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరధ్వాజ
ఓం శ్రీ రంగనాథాయ నమః
ఓం గోదాయై నమః
🌿 విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో రంగనాథుడిని పరమభక్తితో సేవించడం ద్వారా గోదాదేవి ఆయనను వరించి, తన భక్తిని చాటుకుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ఈనెలలోనే ప్రవేశిస్తాడు. నిత్యం తిరుప్పావై పారాయణం చేస్తూ విష్ణుమూర్తిని, శ్రీ కృష్ణుని తులసి ఆకులతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయని అలాగే సంపద, ఆరోగ్యం, మోక్షం లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతం ముఖ్యమైనదని పురోహితులు చెబుతున్నారు. ఈ వ్రతం సందర్భంగా నెలరోజుల పాటు రోజుకో పాశురం చొప్పున విన్నపం చేస్తారు. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గోదాదేవి రోజుకో రీతిలో తిరుప్పావై పాశురాలను ఆలపించింది. ఒకటి నుంచి ఐదు రోజులు నియమ నిబంధనలకు సంబంధించిన పాశురాలు, 6వ రోజు నుంచి 15వ రోజు వరకు పాశురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి సందగోపుని గృహానికి వెళ్లడం. 16, 17, 18వ రోజుల్లో పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొలపడం, 23వ రోజు పాశురంలో మంగళాశాసనం, 25, 26వ రోజుల్లో స్వామికి అలంకారాలైన ఆయుధాలను 'పర' అనే వాయిద్యాన్ని తమ శరణాగతిని అనుగ్రహించి, తమ సంకల్పాన్ని నేరవేర్చమని ప్రార్థిస్తారు. చివరి రోజు గోదారంగనాథుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ధనుర్మాసం మొత్తం నిత్యం ప్రతి ఇంటి ముందు కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గోదాదేవి, లక్ష్మీదేవి, గౌరీమాతగా భావిస్తారు. గోవుపేడతో పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచుతారు. 🌿
🍀 1.పాశురము 🍀
మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !
భావము - సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించు చున్నది.
🍁 ధనుర్మాసంలో విశిష్టమైన రోజులు 🍁
2025, డిసెంబరు 24వ తేదీన వేశేష ధూప్ సేవ(తూమని మాడత్తు)
డిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి (ఉత్తరద్వార దర్శనం)
2026, జనవరి 3వ తేదీన విశేష దీపాలంకరణ సేవ(కుత్తు విళక్కెరియ)
జనవరి 8వ తేదీన పొన్నాకుల హారతి (అన్జు ఇవ్వులగం)
జనవరి 11వ తేదీన విశేష ప్రసాద సేవ (కూడారై వెల్లుం)
జనవరి 14వ తేదీన భోగి రోజున పూలంగి సేవ, శ్రీగోదారంగనాథుల కల్యాణం
🌹 🌹 🌹 🌹 🌹


Comments