డిసెంబర్ 18న నేడు చివరి మాస శివరాత్రి. Today, December 18th, is the last monthly Shivaratri of the year.
- Prasad Bharadwaj
- 7 hours ago
- 2 min read

🌹 🔱 డిసెంబర్ 18న నేడు చివరి మాస శివరాత్రి. నేటి రాత్రి మాసశివరాత్రి వ్రతం చేసి రాహు-కేతు దోషాల నుంచి విముక్తి పొందండి. 🔱🌹
ప్రసాద్ భరద్వాజ
ఈ ఏడాదిలో చివరి మాస శివరాత్రి డిసెంబర్ 18న అంటే నేడు వచ్చింది. ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థశి తిథిరోజు మాసశివరాత్రి వ్రతం చేస్తారు.మాస శివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.
ఈ వ్రతం మహత్యం శివపురాణంలో కూడా ఉంది. లక్ష్మీదేవి, ఇంద్రాణి, సరస్వతి, గాయత్రి, సావిత్రి, సీత, పార్వతి కూడా మాసశివరాత్రి వ్రతం చేశారని పురాణాల్లో ఉంది.
మాఘమాసం కృష్ణ పక్ష చతుర్థశి తిథి.. డిసెంబర్ 18 గురువారం తెల్లవారుఝామున 2 గంటల 32 నిమిషాలకు మొదలవుతుంది.. సూర్యోదయం , సూర్యాస్తయమం వరకూ చతుర్థశి తిధి ఉంది. శివ పూజ కోసం ఈ రోజు రాత్రి 11.51 నుంచి రాత్రి 12.45 వరకు శుభ ముహూర్తం.
🌻 రాహు-కేతు అశుభతను దూరం చేసే మాస శివరాత్రి వ్రతం 🌻
రాహు-కేతు అశుభ ప్రభావం వల్ల జీవితంలో సంతోషం దూరమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుని పూజ చెయ్యడం వల్ల రాహు దోషం నుంచి విముక్తి లభిస్తుంది.అందుకే మాస శివరాత్రి రోజు నిశిత కాల ముహూర్తంలో శివునికి నీటితో అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. ఎవరి కుండలిలో రాహు-కేతు మహాదశ ఉంటుందో..మాసశివరాత్రి రోజు పూజ చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఇది రాహు-కేతు జానిత అన్ని రకాల దోషాలను సమాప్తం చేస్తుంది.
🔱 అసంభవాన్ని సంభవం చేసే మాసశివరాత్రి వ్రతం 🔱
మాస శివరాత్రి వ్రతం చెయ్యడం వల్ల ఎంత కష్టమైన పని అయినా సంపూర్ణం అవుతుందని..చేపట్టిన పనిలో అడ్డంకులు తొలగి పోతాయని భక్తుల విశ్వాసం.
🌿 మాస శివరాత్రి వ్రతం ఎలా చేయాలి? 🌿
మాసశివరాత్రి వ్రతం చేయాలని సంకల్పం తీసుకోండి..ఇంట్లో శివలింగానికి అభిషేకం చేయండి..లేదంటే ఆలయానికి వెళ్లిరండి..ఆలయంలో 11 ప్రదక్షిణలు చేయండి.
సాయంత్రం కూడా శివపూజ చేయండి. మహాశివరాత్రికి చేసినట్టే జాగరణ చేస్తే ఇంకా మంచిది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తర్వాత పండ్లు తీసుకోండి..మసరుటి రోజు ఉపవాసం విరమించండి.
"ఓం నమః శివాయ" మంత్రాన్ని 108 సార్లు జపించండి. శివ అష్టోత్తరం లేదా శివ తాండవ స్తోత్రం పఠించండి.రాత్రంతా జాగరణ చేసి శివనామస్మరణ చేయండి.
సంవత్సరానికి 12 మాస శివరాత్రులు వస్తాయి.. వీటిలో మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రినే మాఘ మహాశివరాత్రిగా జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజు పాటించే నియమాలనే ఈ మాస శివరాత్రి రోజు అనుసరించాలి. ఈ రోజు ఉపవాసం ఆచరిస్తే పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గ్రహదోషాల నివారణ కోసం, సంతానం, ఆరోగ్యం, వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగించుకునేందుకు కూడా మాసశివరాత్రి వ్రతం చేస్తారు.
🌹🌹🌹🌹🌹


Comments