🌹 🔱 డిసెంబర్ 18న నేడు చివరి మాస శివరాత్రి. నేటి రాత్రి మాసశివరాత్రి వ్రతం చేసి రాహు-కేతు దోషాల నుంచి విముక్తి పొందండి. 🔱🌹 ప్రసాద్ భరద్వాజ ఈ ఏడాదిలో చివరి మాస శివరాత్రి డిసెంబర్ 18న అంటే నేడు వచ్చింది. ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థశి తిథిరోజు మాసశివరాత్రి వ్రతం చేస్తారు.మాస శివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ వ్రతం మహత్యం శివపురాణంలో కూడా ఉంది. లక్ష్మీదేవి, ఇంద్రాణి, సరస్వతి, గాయత్రి, సావిత్రి, సీత, పార్వతి కూడా మాసశివరాత్రి వ్రతం చేశారని పురాణాల్లో ఉంది.