మానవజన్మ - పరమార్థం Human birth - the ultimate meaning
- Prasad Bharadwaj
- 4 hours ago
- 1 min read

🌹 మానవజన్మ - పరమార్థం 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Human birth - the ultimate meaning 🌹
Prasad Bharadwaja
మనిషి జీవితంలో.
ప్రగతి..! అంటే..
ఉద్యోగంలోనూ..! ఆస్తిలోను..! అంతస్తు లోను కాదు..
ఆ మనిషి జీవితంలో.
ఆధ్యాత్మిక ప్రగతి..! ముఖ్యం.
మనిషి జీవితం.
మిగతా జీవుల కంటే గొప్పది.
భగవంతుడు.
తనను చేరుకోవడానికి.
ఒక..! అవకాశంగా.°
మనుష్య జన్మ నిస్తాడు.
కావున..! ఈ జన్మలో.
ఆ స్వామిని చేరుకోవడానికి.
మార్గం ఏర్పాటు చేసుకోవాలి.
అన్యధా..! శరణంనాస్తి..
త్వమేవ..! శరణంమమ..
ఓ అరుణాచలేశ్వరా!!
నీవు కోపము లేని సద్గుణుడవు..నీ భక్తుడనైన నన్ను లక్ష్యంగా చేసుకుని నన్ను స్వీకరించు.. అలా స్వీకరించకుండా ఆలస్యం చేస్తున్నావు.. నేను నీకు తక్కువ ఏమి చేసాను...
నేను మానవ మాత్రుడను.నీవలె క్రోధము మొదలైన అరిషడ్వర్గాలను జయించిన వాడను కాను.. అందువలన నేను పొరపాట్లు చేసి ఉండవచ్చు.. కానీ నీవు కోపము వంటి గుణాలు లేని సద్గుణవంతుడవు కదా... అడుగకుండానే భక్తులను రక్షిస్తావన్న కీర్తి నీకు ఉన్నది.. నీ భక్తుడనైన నన్ను రక్షించటమే నీ ధ్యేయం,నీ బాధ్యత.నేను నీకు శరణాగతుడనైనపుడు నీ దృష్టికి నేను ఎందుకు లేను... నేను నీకు ఏమి తక్కువ చేశాను.. నాకున్న సమస్తము అనగా ధన మాన ప్రాణాలను నీకు అర్పించి శరణు వేడుతున్నాను కదా.
నీవు నాకు ఏమీ ఇవ్వనవసరము లేదు..ఏదో లాభము ఆశించి నేను నీ దగ్గరకు రాలేదు.. నన్ను నీలో ఐక్యము చేసుకో చాలు.. అంతే నాకు కావలసింది..
భగవద్గీత.....
శ్లో॥ చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున ।
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ॥
నలుగురు నన్ను భజిస్తారు..కష్టములో ఉన్నవాడు, జ్ఞానము కోరేవాడు, ధనం కోరేవాడు, మరియు జ్ఞాని.
భక్తుని దృష్టిలో తన సాధనలో ఉన్న లోపాల కన్నా భగవంతునిలో లేని లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి...
కానీ భగవంతుడు భక్తుని లోపాలు ఎంచకుండా అతని శరణాగతిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని అతనిని అంగీకరిస్తాడు.
శరణాగతి భక్తుల లోపాలను క్షమించి,అభయమిచ్చే స్థితి..
సంపూర్ణ శరణాగతి చెందిన భక్తునికి భగవంతుడు అభయము ఇచ్చే క్షణం కోసం ఎదురుచూస్తున్న ఉండడమే నిజమైన సాధన. జీవిత పరమావధి, సాఫల్యత.
🌹 🌹 🌹 🌹 🌹



Comments