🌹 సఫల ఏకాదశి విశిష్టత. డిసెంబర్ 15, తిథి ప్రారంభం, ముగింపు.. చదవాల్సిన మంత్రాలు 🌹 ప్రసాద్ భరద్వాజ మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే సఫల ఏకాదశి తిథిని, ఆ రోజున ఆచరించే వ్రతాన్ని చాలా ఫలవంతమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఏదైనా రంగంలో విజయం సాధించాలనుకునే వాళ్లు ఈ సఫల ఏకాదశి తిథి రోజున చేసే పరిహారాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని చెబుతారు. ఈ సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధించడం శుభప్రదం. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో కృష్ణ పక్షంలో ఏకాదశి రోజున ఈ స