🌹 నరనారాయణ అవతారాలు - బదరీనాథుని ఆవిర్భావం - బదరీనాథ్ క్షేత్రం పురాణగాధ. ఊర్వశి జననం 🌹 ప్రసాద్ భరధ్వాజ బ్రహ్మ మానస పుత్రుడైన ధర్ముడికి దక్ష ప్రజాపతి తన పది మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. ధర్మానికి అధిష్టాన దేవత అయిన ధర్ముడు తపస్సు చేసి విష్ణుమూర్తి అనుగ్రహం సంపాదించాడు. మహావిష్ణువు వరం కోరుకోమనగా శ్రీహరిని పుత్రుడిగా కావాలని కోరుకున్నాడు.తగిన సమయంలో జన్మిస్తాను అని వరమిచ్చి విష్ణువు అంతర్ధానమయ్యాడు. కొంతకాలానికి ధర్ముడికి విష్ణువు "నరుడు నారాయణుడు" అనే నామాలతో ఇద్దర