🌹 నేటి నుంచే పుష్యమాసం.. శనీశ్వరుడికి ప్రీతికర మాసం పుష్యమాసం 🌹 ప్రసాద్ భరద్వాజ పుష్య మాసం పుణ్య మాసం. ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంటాడు, అందుకే దీనికి పుష్య మాసం అని పేరు వచ్చింది. అటు శనిదేవుడి జన్మనక్షత్రం కూడా పుష్యమే.. అందుకే ఈ మాసం శని దేవునికి ప్రీతికరమైనది. ఆయనను పూజిస్తే కష్ఠాలు తొలగి శుభాలు కలుగుతాయని నమ్మకం. విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం, శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్ర వచనం. ఈ నెలలో చేసే గింజంత దానమైనా