🌹 మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాల మహిమ - సంక్రమణం అనగా మార్పు - గుమ్మడికాయ దానం, బ్రహ్మాండ దాన ఫలం - ఉత్తరాయణం దేవతలకు పగలు - నదీస్నానం, సూర్యనమస్కారం, వేదాధ్యయనం, గృహప్రవేశం, ఉపనయనం, వివాహ శుభకార్యాలకు విశేష ఫలితం 🌹 ✍️ ప్రసాద్ భరధ్వాజ సాక్షాత్ దైవస్వరూపుడైన సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. సంక్రమణం అనగా మార్పు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మేషం నుండి మీనం వరకు మొత్తం పన్నెండు రాశులు ఉన్నాయి. సూర్యుడు ప్రతి నెలా ఒక్కో రాశిలో ప్రవేశిస్